- లంచం తీసుకునేందుకు ఎస్కేప్ ప్లాన్స్
- సరికొత్త ఐడియాలతో కరప్షన్
- లంచం ఇస్తున్నవ్యక్తిపైన కరప్టడ్ ఆఫీసర్స్ నిఘా
- లంచం క్యాష్ ను టచ్ చేయడానికి 3 గంటలు వెయిటింగ్
- ప్రైవేట్ వ్యక్తులతో (బ్రోకర్స్) కలెక్షన్..
లంచం తీసుకున్నట్టు ఆధారం దొరకకుండా చేయడానికి అవినీతి అధికారులు తీసుకుంటున్న జాగ్రత్తలు ఆసక్తిని రేపుతున్నాయి. జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాని లంచం మాత్రం వద్దనడం లేదు. ఇటీవల ఏసీబీ సోదాలు, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతున్న సంఘటనలను విశ్లేషించినప్పుడు లంచం తీసుకునేందుకు కరప్టడ్ ఆఫీసర్స్ అవలంభిస్తున్న ప్రక్రియ ఏసీబీ అధికారులను విస్తుపోయేలా చేస్తుంది.
ఒక పేపర్ మీద అంకెసు రాసి..
ఈ మధ్య లంచానికి సంబంధించిన అంకెలను ఫోన్ లో చెప్పడం లేదు. ఒక పేపర్ మీద అంకెను రాస్తున్నారు. ఉదాహరణకు ఒక పేపర్ మీద 1 అని రాశారంటే అది లక్ష అని అర్థం. ఈ పేపర్ మీద రాసేది కూడా నేరుగా పని మీద వచ్చిన బాధితుడికే పేపర్ మీద అంకేవేసిస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో లంచం డబ్బులు తీసుకువచ్చిన వ్యక్తిని ఒక చోట నుంచి మరో చోటుకు ఇలా రెండు మూడు చోట్లను మార్చి ఆ తర్వాత తీసుకుంటున్నారు. ఇలా చోట్లు మారుస్తున్న సమయంలో అతని వెనుక ఎవరైనా ఏసీబీ అధికారులు ఫాలో అవుతున్నారా ఇంకా ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారనే విషయాన్ని లంచం తీసుకుంటున్న అధికారులు వారి ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని ఆరా తీస్తున్నారు. ఆ తర్వాత లంచం డబ్బును తీసుకుంటున్నారు. మరికొంత మంది అధికారులు లంచం తీసుకువచ్చిన వ్యక్తిని దాదాపు 2 నుంచి 3 గంటల పాటు కూర్చోబెట్టి ఆ తర్వాత ఎవరూ లేరని ఇప్పుడు డబ్బు తీసుకుంటే సేఫ్ అని వాటిని ముడుతున్నారు..
ప్రైవేట్ వ్యక్తులతో కలెక్షన్..
ఇంకా కొంత మంది తెలివైన వారు కొంత మంది ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని వారితో కలెక్షన్ చేయిస్తున్నారు. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులలో ఇక ఏసీబీ అధికారులకు చుక్కలే కనిపిస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన అవినీతి అధికారుల ప్రవర్తన తీరు, వారు ఇచ్చే పొంతన లేని సమాధానాలు, ఇక అనేక విచిత్ర ప్రవర్తనలతో తప్పించుకునేందుకు వారు చేసే హడావిడి అంతా ఇంతా ఉండదని తెలుస్తోంది. ఈ విధంగా లంచానికి అలవాటుపడ్డ అధికారులు ఏసీబీ అధికారులకు చిక్కక్కుండా వాటి నుంచి తప్పించుకునేందుకు సరికొత్త ఆలోచనలతో ఎస్కేప్ సోల్యూషన్స్ ను వెతుకుంటున్నారని స్పష్టమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారుల యాక్షన్ తో అవినీతి అధికారులు రోజుకో కొత్త ఎస్కేప్ రూట్స్ ను తీసుకువస్తున్నారని ఈ సంఘటనలు దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో ఏసీబీ అధికారులు కూడా అవినీతి అధికారులను ఆధారాలతో పట్టుకోవాలంటే అందుకు ధీటుగా స్కెచ్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఏసీబీ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం 1064 హె ల్ప్ లైన్ కు అవినీతి అధికారులపై ఫిర్యాదులు పెరిగాయని ఏసీబీ అధికారులంటున్నారు. ఈ ఫిర్యాదుల తీవ్రతను బట్టి యాక్షన్ ప్లాన్ ను 2 నుంచి వారం రోజులలో అమలు చేస్తున్నామని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి.