ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్త్రీశక్తి ని కొనియాడారు. కుటుంబ వ్యవస్థను ముందుకు నడపడంలో మహిళల త్యాగం మహోన్నతమైనదన్నారు. దేశ సంపదను సృష్టించడంలో పౌరులుగా వారి పాత్ర గొప్పదన్నారు. ఎన్నో కష్టాలను అధిగమిస్తూ పురుషుడితో సమానంగా నేటి సమాజంలో స్త్రీ పోశిస్తున్న పాత్ర అమోఘమని తెలిపారు. అవకాశాలిస్తే అబల సబలగా నిరూపించుకుంటుందన్నారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర మహిళాభ్యున్నతికోసం అమలు చేసిన పలు కార్యక్రమాలు వారి సాధికారతకు దోహదం చేయాశయని కేసీఆర్ గుర్తుచేశారు. మహిళల ఆరోగ్యం, సంరక్షణ, సంక్షేమం తో పాటు పలు కీలక అభివృద్ధి పథకాలల్లో మహిళకే ప్రాధాన్యతనిచ్చామన్నారు. వారి కేంద్రంగానే పథకాలను అమలు చేశామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రగతిలో మహిళలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం భాగస్వామ్యం చేసిందన్నారు. అదే స్పూర్థిని కొనసాగిస్తూ మహిళాసాధికారతకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. వారిని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దడం ద్వారానే తెలంగాణ అభివృద్ధి మరింత ముందుకు సాగుతుందని చెప్పారు.