పచ్చని అడవిని కాలుష్యం చేస్తామంటే ఊరుకోము : జేఏసీ నాయకులు

ప్యారానగర్‌లో డంపింగ్‌యార్డును ఏర్పాటు చేసి అడవిని కాలుష్యం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని జేఏసీ నాయకులు హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా నర్సాపూర్‌లో చేపట్టిన రిలేనిరాహార దీక్ష ఆదివారం నాటికి 19వ రోజుకు చేరుకుంది.

ఈ సందర్బంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. డంపింగ్‌యార్డు నిర్మాణంతో అడవితోపాటు రాయారావు చెరువు కాలుష్యం అవుతుందని గుర్తుచేశారు. డంపింగ్‌యార్డు నిర్మాణాన్ని నిలిపే వరకు ఉద్యమం కొనసాగిస్తామని వెల్లడించారు. ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి డంపింగ్‌యార్డు నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు దేవెందర్‌యాదవ్‌, మహేశ్‌గౌడ్‌, దయానంద్‌, నరేందర్‌చారి తదితరులు పాల్గొన్నారు.