నల్లమల అడవులలో అగ్ని ప్రమాదం

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలోని నల్లమల అడవులలో కార్చిచ్చు రాజుకున్నది. నాలుగైదు రోజుల నుంచి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది.

దాదాపు 100 ఎకరాల్లో మంటలు అంటుకోగా.. బ్లోయర్స్‌ సాయంతో మంటలను అదుపు చేశామని కొల్లాపూర్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి చంద్రశేఖర్‌ తెలిపారు. గత నెల 24వ తేదీ ముందు నుంచి నల్లమలలో కార్చిచ్చు రాజుకుంటున్నదని తెలిపారు. అటవీ ప్రాంతాల సమీపంలో ప్రజలు, గొర్రెల కాపరులు అగ్నికి సంబంధించిన వస్తువులు తీసుకెళ్తే చట్టరీత్యా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.