మెదక్ మున్సిపల్ కార్యాలయం లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో జరిగాయి. మెదక్ మున్సిపాలిటీ 2వ వార్డ్కు చెందిన శివ కుమార్ తన అక్క పేరు మీద ఉన్న ఇంటి స్థలాన్ని తన పేరు మీదకు మ్యుటేషన్ చేయాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ జానయ్యను కోరాడు. దానికి మున్సిపాలిటీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ జానయ్య రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు.
అందులో భాగంగా రూ.12 వేల ఒప్పందం కుదిరింది. దీనితో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. అందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం మెదక్ – హైదరాబాద్ ప్రధాన రహదారిపై బాధితుడు నుండి రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
రెవెన్యూ ఇన్స్పెక్టర్ జానయ్యను అరెస్టు చేసి రిమాండ్ తరలిస్తున్నట్టు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. ఈ సోదాలో సీఐలు వెంకటేశ్వర్లు, రమేష్, రామారావు సిబ్బంది తదితరులు ఉన్నారు.