అసెంబ్లీలో కేటీఆర్ తో తీన్మార్ మ‌ల్ల‌న్న భేటీ

అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హ‌రీశ్‌రావుతో ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న క‌లిశారు. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ నేత‌ల‌తో తీన్మార్ మ‌ల్ల‌న్న బీసీ బిల్లుపై చ‌ర్చించారు. బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్దత కల్పించేలా ఢిల్లీ వేదికగా తాము చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా బీఆర్ఎస్ నేత‌ల‌ను తీన్మార్ మల్లన్న కోరారు.

ఈ సంద‌ర్భంగా తీన్మార్ మ‌ల్ల‌న్న మాట్లాడుతూ.. ప్రభుత్వం బీసీ బిల్లు తేవటం కాదు. అవసరం అయితే కేంద్రంలో ఆమోదం కోసం జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలని సీఎంకు డిమాండ్ చేస్తున్నాం. మీ సహకారం కావాలని మ‌ల్ల‌న్న కోరారు.