రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు దారుణం: బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

 నిన్న ఎంఎంటీఎస్ రైలులో ఓ యువ‌తిపై అత్యాచార‌య‌త్నం జ‌రిగిన ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అత్యాచాయ‌త్నం నుంచి తన‌ను తాను ర‌క్షించుకునేందుకు ఓ యువ‌తి ఎంఎంటీఎస్ రైలు నుంచి కింద‌కు దూకాల్సి వ‌చ్చింద‌న్నారు. ఈ ఘ‌ట‌న తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ ఘ‌ట‌న‌పై త్వ‌ర‌గా విచార‌ణ‌ను పూర్తి చేయాల‌ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణ‌వ్‌కు కేటీఆర్ అభ్య‌ర్థించారు. తెలంగాణ పోలీసులు, మ‌హిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా బాధితురాలికి అన్ని విధాలా అండ‌గా ఉండాల‌న్నారు. ఈ ఘ‌ట‌న రైల్వే పోలీసుల ప‌రిధిలో ఉన్న‌ప్ప‌టికీ.. ఇది రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఒక మేల్కొలుపు లాంటిది అని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు దారుణంగా ఉన్నాయ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.