స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చింతలపాలెం ఎస్సై

పీడీఎస్‌ బియ్యం కేసులో స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ ఓ ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో చోటుచేసుకున్నది. నిరుడు అక్టోబర్‌ 23న పీడీఎస్‌ బియ్యం రవాణా విషయంలో ఆరుగురిపై కేసు నమోదైంది. కేసులో ఓ వ్యక్తికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు ఎస్సై రూ.15 వేలు డిమాండ్‌ చేయగా చివరకు రూ.10 వేలకు ఒప్పందం కుదిరింది. రూ.10 వేలు లంచం తీసుకోగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.