ఢిల్లీ పీఠంపై మరోసారి కేజ్రీవాల్

ఢిల్లీ ప్ర‌జ‌లు ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్ కే మరోసారి ప‌ట్టం క‌ట్టారు. సీఎం కేజ్రీవాల్‌కే మ‌ళ్లీ పీఠాన్ని అప్ప‌గించారు. వ‌రుస‌గా మూడ‌వ సారి కేజ్రీవాల్ .. ఢిల్లీ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఈనెల 8వ తేదీన జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మ‌ళ్లీ ఘ‌న విజ‌యం సాధించింది. 2014లో గెలిచిన కేజ్రీ.. అనూహ్య రీతిలో త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. 49 రోజుల ప్ర‌భుత్వాన్ని ఆయ‌న వ‌దులుకున్నారు. ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పి మ‌ళ్లీ 2015లో పూర్తి మెజారిటీ సాధించారు. అయితే గ‌త అయిదేళ్ల‌లో కేజ్రీవాల్‌.. ఢిల్లీని అభివృద్ధి ప‌థంలో న‌డిపారు. అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టారు. దీంతో ప్ర‌జ‌లు ఆయ‌న వెంటే నిలిచారు. 2020 అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ కేజ్రీవాల్‌ను గెలిపించారు.