భూ భారతితో శాశ్వత పరిష్కారం : కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్

భూ భారతి చట్టం-2025 ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిస్కారం లభిస్తుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఆర్ఎస్‌వీ ఫంక్షన్ హాల్ నందు భూ భారతి చట్టం 2025 పై నిర్వ‌హించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. భూ భారతి చట్టం ఈ నెల 14న ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు జరుగుతుందని తెలిపారు. తదుపరి ప్రతి జిల్లాలో ఒక్క మండలంలో అమలు చేస్తారని, అక్కడ ఏమైనా సమస్యలు పరిస్కారం కాకపోతే చట్టంలో మార్పులు తెచ్చి తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తార‌ని తెలిపారు.

జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు.. మాట్లాడుతూ రైతు సంకెళ్లు విడిపించేలా భూ భారతి చట్టంను తెలంగాణ ప్రభుత్వం రూపొందించిందని, ఇక నుండి భూ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం కానున్న‌ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ సూర్యనారాయణ, తాసీల్దార్ వాజీద్ అలీ, ఎంపీడీఓ రామచంద్రరావు, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేశ్‌, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, పీఏసీఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కోదాడ మండలాధ్య‌క్షుడు తుమాటి వరప్రసాద్ రెడ్డి, మందలపు శేషు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.