ఎక్సైజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఓ అధికారి రూ.8వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. వికారాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో పని చేసే ఓ అధికారికి చెందిన డీఏ బిల్లును ప్రాసెస్ చేయడానికి అదే కా ర్యాలయంలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ రూ.8వేల లంచం డిమాండ్ చేశాడు. తన వద్ద డబ్బులు లేవని, డీఏ డబ్బులు రూ.76 వేలు రాగానే ఇస్తానని చెప్పాడు. ఈ మేరకు శుక్రవారం సీనియర్ అసిస్టెంట్ రూ.8వేల లంచం తీసుకుంటుండగా జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసుకొని నాంపల్లి కోర్టులో హాజరు పరుస్తామని పేర్కొన్నారు.
