అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద పాత్రికేయులకు, వృత్తి నిర్వహణలో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.
వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలతో పాటు నిరుపేద జర్నలిస్టులకు శుక్రవారం నాంపల్లి ప్రెస్ అకాడమీ కార్యాలయంలో పింఛను, ఎక్స్‌గ్రేషియాకు సంబంధించిన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మండల కేంద్రాలు, నియోజకవర్గాల స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులను ఆదుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.