85.16 లక్షల మొక్కలు నాటాలి – నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌

నల్లగొండ జిల్లాలో 2020-21లో 85.16 లక్షల మొక్కలు నాటాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అన్నారు. శనివారం తెలంగాణకు ‘హరితహారం’పై జిల్లా స్థాయి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంను కలెక్టరేట్‌లో నిర్వహించారు. తొలుత 2020లో నర్సరీ, మొక్కలు నాటే లక్ష్యంపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా అటవీశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 2019-20లో కోటి 10లక్షల16వేల మొక్కలు నర్సరీల్లో పెంచాలని లక్ష్యం నిర్ణయించగా, 2020-21లో 85.16 లక్షల మొక్కలు నాటాలన్నారు. గ్రామీణాభివృద్ధ్ది శాఖతో 2020లో నర్సరీల్లో 70.66 లక్షల మొక్కలు పెంచాలని, ఇందులో నర్సరీలో 62.66 లక్షలు, కన్వర్షన్‌ 8లక్షల మొక్కలుగా నిర్ణయించారు. టేకు, ఈత, హోమ్‌ స్టెడ్‌ మొక్కలు నాటాలన్నారు. ఐసీడీఎస్‌శాఖ ద్వారా 10వేలు, అటవీశాఖ ద్వారా 20లక్షలు, ఇతర శాఖల ద్వారా 20లక్షలు నాటాలని నిర్ణయించారు. 2020 జూన్‌లో అటవీశాఖ ద్వారా 2లక్షలు హరిత వనాలుగా అటవీ భూముల్లో నాటేందుకు లక్ష్యాన్ని నిర్ధేశించారు. వ్యవయశాఖ 3లక్షలు టేకు, 50వేలు వెదురు చెట్లు, ఎక్సైజ్‌కు 3లక్షలు, మైనర్‌ ఇరిగేషన్‌కు లక్ష, అదే విధంగా మున్సిపాల్టీలకు మొక్కలు నాటాలన్నారు. సమావేశంలో డీఎఫ్‌ఓ శాంతారాం, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి శేఖర్‌రెడ్డి, డీఈఓ భిక్షపతి, ఐసీడీఎస్‌ అధికారి సుభద్ర, మైనర్‌ ఇరిగేషన్‌ డిప్యూటీ ఈఈ శంకర్‌రెడ్డి తదితరులున్నారు.