- రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ప్రారంభించడం ఆనందకరం…
- మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు
- ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం
- మాచారం బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రజల ఆశీస్సులతో విజయం సాధించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని ఈ విషయంలో మరింత అభివృద్ధి చేసేందుకు మంత్రి వర్గం ఎంతో కృషి చేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభ్యున్నతికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, స్థానిక ఎమ్మెల్యేలు… నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ ప్రాంతంలో ఉన్న మాచారంలో సోమవారం ప్రారంభించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మాచారంకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులకు కలెక్టర్ బాదావత్ సంతోష్, ఉన్నతాధికారులు పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతంం పలికారు. అనంతరం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు స్థానికంగా ఉన్న సీతరామాంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ పూజారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజనుల కోసం రూ.12,600 కోట్లకు సంబంధించిన నల్లమల డిక్లరేషన్‌ను ఆవిష్కరించారు. అంతకు ముందు ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం పైలాన్‌ను ప్రారంభించారు. అనంతరం మాచారంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ … ఒకప్పుడు నల్లమల్ల ప్రాంతం అంటే ఎంతో వెనుకబడిన ప్రాంతమని… ఎవరో నాయకుడు వచ్చి అభివృద్ధి చేయాలనే వారు… కానీ ప్రస్తుతం ప్రజల ఆశీస్సులతో ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా వచ్చి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహించిన మహేంద్రనాథ్, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా రాణించిన జైపాల్‌రెడ్డి, రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావులు పుట్టిన ప్రాంతమని…ఈ విషయంలో తను నల్లమల్ల బిడ్డగా ఎంతో గర్వంగా ఉందన్నారు. పాలమూరు జిల్లా బిడ్డలను అప్పట్లో అన్ని ప్రాంతాల్లో కూలీ పనులు చేసేందుకు పిలిచేవారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అలాగే ఈ నల్లమల్ల అటవీ ప్రాంతంలో నల్లమల్ల డిక్లరేషన్ సహచర మంత్రి వర్గంతో కలిసి చేయడం సంతోషమని… అప్పట్లో తాను అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణను గెలించాలని ఎన్నికల సమయంలో తాను కోరగా యాభైవేల పైచిలుకు మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించారని.. ప్రస్తుతం 65 మంది శాసనసభ్యులు ఉండటం వల్ల తాను నల్లమల్ల బిడ్డ గా చెప్పుకోవడానికి గర్వంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణకు ఎంత బాధ్యత ఉందో తనకు ముఖ్యమంత్రిగా అంతే బాధ్యత తనకు ఉందని… నల్లమల్ల ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచించాలని… నిధులు విడుదల చేయాలని… ఈ ప్రాంతంలో ఉద్యోగ, విద్యను అందించాలని మంత్రులకు తెలియజేశానన్నారు. ఈ ప్రాంతంలో రైతన్నలు దున్నుకుంటే పోడుభూములు మంచి భూములుగా మారాయని… ప్రస్తుతం గిరిజనులు ఆత్మగౌరవంతో ఉండే విధంగా ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం చేపట్టడం జరిగిందన్నారు. ఈ రోజు తమ చెంచు ఆడపడుచులతో మాట్లాడితే అలివేలు అనే మహిళ తోటల పెంపకం గురించి అవగాహన కల్పించుకున్నారని ఈ విషయంలో ఆనందకరంగా ఉందన్నారు. అలాగే ఇళ్ళకు, వ్యవసాయ అవసరాలకు సోలార్ విద్యుత్తుపై అవగాహన కల్పించడంతో పాటు సోలార్‌తో విద్యుత్తు అవసరాలు తీర్చుకునేలా ఇళ్ళకు సైతం ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలిచ్చినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ సోలార్ పంపుసెట్లను రాబోయే వంద రోజుల్లో ఉచితంగా అందచేయడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో అచ్చంపేట ప్రపంచానికి, దేశానికి ఆదర్శమని తెలిపారు. 2023 డిసెంబరు 7వ తేదీన అధిక…