ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలోని జూ పార్కులను నడపాలని మంత్రి కొండాసురేఖ సూచించారు. రాష్ట్ర సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జూస్ అండ్ పార్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (జపాట్) 14వ గవర్నింగ్ బాడీ సమావేశం గురువారం నిర్వహించారు. జూ పార్కులతో పాటు అర్బన్ ఫారెస్ట్ పారుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మంత్రి ఆదేశించారు.
సందర్శకుల అభిరుచి మేరకు పర్యావరణానికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అటవీశాఖకు ఆదాయం సమకూరేలా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్, హెచ్‌వోఎఫ్‌ఎఫ్ డాక్టర్ సువర్ణ, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఏలూసింగ్ మేరు, సీసీఎఫ్‌లు ప్రియాంక వర్గీస్, రామలింగం, డైరెక్టర్ ఆఫ్ జూ పార్స్ సునీల్ ఎస్ హేరామత్, డీఎఫ్‌వోలు పాల్గొన్నారు.