లంచం తీసుకుంటూ ఎసిబి(ACB)కి చిక్కిన సర్వేయర్

అవినీతి నిరోధక శాఖ(ACB) వలకు మరో అవినీతి తిమింగళం చిక్కింది. రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఓ సర్వేయర్ ఎసిబికి పట్టుబడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం చంద్రంపేట గ్రామంలో సర్వేయర్ల సమావేశం జరుగుతుండగా.. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని సర్వేయర్ నాగరాజు లంచం డిమాండ్ చేశాడు. అతని వద్ద నుంచి రూ. 15వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సర్వేయర్ పై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.