లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఐఏఎస్‌

ఒక వ్యాపారవేత్త నుంచి రూ.10 లక్షల లంచం తీసుకుంటూ ఒడిశాకు చెందిన ఒక ఐఏఎస్‌ అధికారి సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా విజిలెన్స్‌ శాఖకు పట్టుబడ్డాడు. 2021 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన దిమాన్‌ చక్మా కల్హండి జిల్లా ధర్మగర్‌లో సబ్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఒక వ్యాపారికి చెందిన ఫైల్‌ క్లియర్‌ చేయడానికి రూ.20 లక్షల లంచం డిమాండ్‌ చేశాడు. మొదటి విడతగా రూ.10 లక్షల లంచాన్ని అతని నుంచి చక్మా తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. ఆ అధికారి ఇంటిపై దాడి జరిపి సోదాలు నిర్వహించగా, రూ.47 లక్షల నగదు దొరికింది.