సంగారెడ్డి కలెక్టర్‌ గా బాధ్యతలు స్వీకరించిన పి.ప్రావీణ్య

సంగారెడ్డి కలెక్టర్‌గా పి.ప్రావీణ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఐబీ అతిథి గృహానికి చేరుకున్న ఆమెకు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఆర్డీవో రవీందర్‌ పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని తన చాంబర్‌లో నూతన కలెక్టర్‌గా పి.ప్రావీణ్య బాధ్యతలు స్వీకరించారు.

2016 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారైన ప్రావీణ్య ఇప్పటి వరకు హనుమకొండ కలెక్టర్‌గా పనిచేస్తూ బదిలీ అయ్యారు. అంతకుముందు గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. సంగారెడ్డి కలెక్టర్‌గా పనిచేసిన వల్లూరు క్రాంతి టూరిజం మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు.