మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన  మిక్కిలినేని మను చౌదరి

మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌గా మిక్కిలినేని మను చౌదరి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌కు వచ్చిన ఆయనకు ముందుగా కీసర గుట్ట రామలింగేశ్వరస్వామి దేవస్థాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్‌రెడ్డి, రాధికా గుప్తా, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు తహసీల్దార్లు కలెక్టర్‌కి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.