సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్‌

సీనియర్‌ జర్నలిస్ట్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాల కేసులో శుక్రవారం కొమ్మినేని బెయిల్‌ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ పీకే మిశ్రా ధర్మాసనం ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. కొమ్మినేని యాంకర్‌గా వ్యవహరించిన సాక్షి టీవీ చర్చలో పాల్గొన్న విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి సంబంధంలేదని, వేరొకరి వ్యాఖ్యలకు పిటిషనర్‌ను ఎలా అరెస్ట్‌ చేస్తారని ధర్మాసనం ప్రశ్నిం చింది.

కిందికోర్టు విధించిన షరతులకు లోబడే బెయిల్‌ మంజూరు చేస్తున్నట్టు పేర్కొన్నది. కొమ్మినేని బెయిల్‌పై ‘ఎక్స్‌’ వేదికగా ఏపీ మాజీ సీఎం జగన్‌ హర్షం వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబుకు చెంపపెట్టు అని అన్నారు. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు న్యాయస్థానం గట్టి బుద్ధిచెప్పిందని పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు అరెస్ట్‌ తీవ్ర భంగకరమని సుప్రీంకోర్టు చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్టు జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.