గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సినీ దర్శకులు వి.వి.వినాయక్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లోని తన ఆఫీస్ ప్రాంగణంలో మొక్కలు నాటిన సినీ దర్శకులు వి.వి.వినాయక్.
ఈ సందర్భంగా వివి.వినాయక్ మాట్లాడుతూ మనిషి బ్రతకడానికి మొక్కలు ఎంతో అవసరం అని అన్నారు.ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ఓ యజ్ఞములా చేస్తున్నారని ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ కు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్,సినీ నిర్మాతలు నల్లమల బుజ్జి,మల్లిడి సత్యనారాయణ రెడ్డి ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధి కాదంబరి కిరణ్ పాల్గొన్నారు.