కొత్తగూడెం పిసిబి(PCB) RO అధికారి అడ్డగోలు అవినీతి బాగోతం

  • ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న RO అధికారి అవినీతి లీలలు..
  • చిన్న చిన్న పరిశ్రమల వారి నుండి భారీగా లంచాలు తీసుకుంటున్న RO అధికారి..
  • CFO, CFE & ఫిర్యాదుల పేరుతో భారీగా లంచాల వసూలు..
  • ప్రశ్నించిన వారిని మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరింపులు..
  • నేను ఎంత అవినీతి చేసిన నన్ను కాపాడుతారు.. మంచి పోస్టింగ్ కూడా ఇస్తారని చెప్పుకుంటన్న RO అధికారి..!
  • ఈ అవినీతి అధికారిని కాపాడుతున్న ఉన్నతాధికారులు ఎవరు..?
  • పరిశ్రమలు, కార్పొరేట్ ఆస్పత్రులు, క్రషర్లు, రైస్ మిల్లులు మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా పిసిబి పరిధిలో ఉన్న అన్నింటిలోనూ భారీగా లంచాలు వసూళ్లు..!
  • ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కొత్తగూడెం పిసిబి RO అధికారి..!
  • ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటున్న పరిశ్రమల యాజమాన్యాలు, పొల్యూషన్ బాధితులు, పర్యావరణ వేత్తలు..
  • గతంలో RO అధికారులపై ఫిర్యాదులు వచ్చాయని రాత్రికి రాత్రే రిపోర్ట్ లు రాసి చర్యలు తీసుకోవడం జరిగింది..
  • కానీ ఇప్పుడు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసిన కూడా చర్యలు తీసుకోవడంలో PCB ఉన్నతాధికారుల అలసత్వం ఎందుకు..?
  • ఫిర్యాదులు చేసిన పరిశ్రమల వారిపై బెదిరింపులకు పాల్పడి దారికి తెచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయా..?
  • పర్యావరణ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రెటరీలకు ఫిర్యాదు చేసిన సచివాలయంలోనే ఫైల్ ఆగడం వెనుక ఉన్న అధికారి ఎవరు..?
  • PCBలో ఎంత పెద్ద తప్పుచేసిన అండదండలు ఇస్తున్న సచివాలయ ఉన్నతాధికారి ఎవరు..?
  • ఫిర్యాదులు పట్టించుకోకపోవడం వెనుక ఉన్న గుట్టు ఏంటి..? పూర్తి వివరాలు త్వరలో మరో కథనంలో..

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం కొత్తగూడెం పరిధిలో గత కొన్ని సంవత్సరాలుగా EE గా పనిచేస్తున్న అధికారి అవినీతి, అక్రమాలలో విచ్చలవిడి తనం పెరిగిపోయింది. ఈయన గారు అవినీతి సొమ్ముకు అలవాటు పడి పొల్యూషన్ చేస్తున్న పరిశమ్రల యాజమాన్యాలతో కుమ్మక్కై పర్యావరణాన్ని గాలికి వదిలేసి పొల్యూషన్ ను క్రియేషన్ చేస్తున్నారని పర్యావరణ వేత్తలు, కాలుష్య బాధితులు నెత్తినోరు కొట్టుకొని చెప్పిన పట్టించుకునే నాథుడే లేకుండా పోయిండు. పొల్యూషన్ చట్టాలను, నియమ నిబంధనలను తుంగలో తొక్కి పరిశ్రమల యాజమాన్యాలతో కుమ్మక్కై, ఒప్పందం చేసుకుని నెల వారి వసూళ్ళకు పాల్పడుతూ పర్యావరణ పరిరక్షణ అనే స్పృహే లేకుండా తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురి నోట వినిపిస్తున్న మాట.

అంతేకాదు పైగా ఈ అధికారి PCBలో ఉన్నతాధికారులు కూడా తనకు అనుకూలంగా ఉన్నారంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అంతటితో ఆగకుండా PCB లో నేను ఏం చేస్తే అదే వేదం అంటూ పరిశ్రమల వారిని బెదిరిస్తూ.. భయపెడుతూ.. మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ తనకు కావాల్సిన పనులను చక్కబెట్టుకోవడం ఇతనికి అలవాటుగా మారిందని కొంతమంది PCB అధికారులు, పరిశ్రమల వారు చెబుతుండటం విశేషం. కొత్తగూడెం ప్రాంతీయ కార్యాలయం పరిధిలో EE గారు అడిందే ఆట, పాడిందే పాటగా సాగిపోతుంది. అదేమంటే నాకు PCBలో ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి అంటూ.. చెప్పుకుంటూ నేను ఎంత అవినీతి అక్రమాలు చేసిన నన్ను సస్పెండ్ కాదు..కదా.. కనీసం నన్ను ఎవరూ టాన్స్ ఫర్ కూడా చేయలేరూ.. ఒక వేళ టాన్స్ ఫర్ చేసిన, నాకు మంచి పోస్టింగే ఇస్తారు అని బీరాలు పలుకుతూ అతని అవినీతిని తారాస్థాయిలో నడిపిస్తున్నాడని అతను అడిగింత లంచం ఇవ్వాల్సిందే అని పలువురు పరిశ్రమల వారు వాపోతున్నారు.

కొద్దిరోజుల క్రితం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని ఓ రైస్ ఇండస్ట్రీకి సంబంధించిన CFO విషయంలో రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసి ఆ పరిశ్రమ వారిని అనేక ఇబ్బందులకు గురిచేసిండు. ఇంత లంచం మేము ఇవ్వలేమూ సర్ అని సదరు పరిశ్రమ వారు ప్రాదేయపడి.. బతిమిలాడగా చివరికి రూ.5 లక్షల లంచం ఇస్తేనే పని అవుతది లేదంటే పరిశ్రమను క్లోజ్ చేస్తాను అని బెదిరించడంతో… ఆ పరిశ్రమ వారికి దిక్కుతోచక PCB జోనల్ కార్యాలయం, హైదరాబాద్ లోని పై అధికారులను సంప్రదించి ఎలాగొలా CFO ను తెచ్చుకోవడం జరిగిందని చెప్పారు. నేను లంచం అడిగితే ఇవ్వకుండా నన్ను కాదని ZO కి వెళ్ళి CFO తెచ్చుకుంటారా.. అని అది మనసులో పెట్టుకొని సదరు పరిశ్రమపై EE గారు మధ్యవర్తులతో (తన ఏజెంట్ల ద్వారా) ఖమ్మం జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేపించడం జరిగింది. ఆట్టి ఫిర్యాదుపై స్పందించిన జిల్లా కలెక్టర్ స్థానిక తహశీల్దార్ ని విచారించమని ఆదేశించగా.. స్థానిక తహశీల్దార్ విచారించి పరిశ్రమ దగ్గరగా పొలాలు ఉన్న రైతులు పరిశ్రమకు అనుకూలంగా చెప్పడంతో ఇది సరైన పద్దతి కాదని పరిశ్రమ వారి తప్పు ఏం కనిపించడం లేదని ఫిర్యాదుదారులను తహశీల్దార్ మందలించి పంపించడం జరిగింది. అయినా సరే PCB EE వదలకుండా మరోసారి ప్రజావాణిలో ఫిర్యాదుదారులతో తహశీల్దార్ మాకు సపోర్ట్ చేయడంలేదని పరిశ్రమవారికి అనుకూలంగా నిర్ణయం తీసుకుండని తమకు న్యాయం చేయాలని అడిషనల్ కలెక్టర్ ని కలిసి ఫిర్యాదు చేపించిండని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ PCB, కొత్తగూడెం ప్రాంతీయ కార్యాలయానికి రాయగా తాను అనుకున్నది అదే కాబట్టి.. EE కోరిన అవకాశం దొరకడంతో సదరు పరిశ్రమను ఇన్స్పెక్షన్ చేయడానికి అని వెళ్ళి నానా హడావిడి చేస్తూ.. పరిశ్రమ వారిని భయబ్రాంతులకు గురి చేస్తూ.. అడిషనల్ కలెక్టర్ నుండి ఆదేశాలు వచ్చినాయి. నువ్వు ఇప్పుడు PCB మొత్తంలో ఎవ్వరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ.. పరిశ్రమకి క్లోజర్ ఆర్డర్ ఇస్తానని భయపెడుతూ.. చివరికి EE అడిగిన రూ.5 లక్షలు లంచం డబ్బును తీసుకొని EE ఈగోను సంతృప్తి పరుచుకోవడం జరిగిందని సదరు పరిశ్రమ వారు వాపోయారు. పరిశ్రమలో ప్రభుత్వానికి సంబంధించిన సిఎంఆర్ బియ్యం ఉండటంతో సదరు పరిశ్రమ వారు భయపడిపోయి.. పరిశ్రమ క్లోజ్ అయితే ప్రభుత్వానికి సంబంధించిన సిఎంఆర్ బియ్యం ఇన్ టైంలో ఇవ్వలేము మరియు కోట్ల రూపాయాల నష్టం వస్తుందని భయపడి EE అడిగిన లంచం ఇవ్వక తప్పలేదు అని పరిశ్రమ వారు చెప్పారు. కొత్తగూడెం EE ప్యాడీ సీజన్ చూసి మమ్మల్ని గన్ పాయింట్ లో పెట్టి భారీగా లంచం తీసుకున్నారని బాధపడ్డారు. ఇట్టి విషయంలో అందరికీ కలిపి రూ. 9 లక్షలు రూపాయాలు భారీ లంచంగా ముట్టచెప్పాల్సి వచ్చిందని.. ఇంత పెద్దఎత్తున లంచం సొమ్ము ఇచ్చిన కూడా ఇంకా సమస్య తీరలేదని.. PCB, కొత్తగూడెం EE లాంటి అధికారులు ఉంటే తాము పరిశ్రమలను నడపడం కష్టం అని చెప్పుకొచ్చారు.
ఇది ఒక్కటే కాదు కొత్తగూడెం PCB, EE చేసిన రాచకార్యాలు చాలానే ఉన్నాయి. ఈయన అడిగిన లంచం ఇవ్వకుంటే మధ్యవర్తులతో (బ్రోకర్ల ద్వారా) ఇబ్బందులకు గురిచేపిస్తూ తాను అనుకున్న లంచం తీసుకునే వరకు నిద్రపోడని.. పరిశ్రమల వారిని నిద్రపోనివ్వడని కొత్తగూడెం RO పరిధిలోని పలువురు పరిశ్రమల వారు బహిరంగంగానే చెబుతున్నారు. ఈయన గారిపై PCB ఉన్నతాధికారులకు పలు ఫిర్యాదులు చేసిన లాభం లేకుండా పోయిందని పలువురు పరిశ్రమల వారు తెలిపారు. EE చేస్తున్న అరాచకాలపై ఎన్ని ఫిర్యాదులు చేసిన తన బుద్ది మార్చుకోకుండా ఇంకా రెచ్చిపోయి భారీ అవినీతికి పాల్పడుతున్నాడు అని పలువురు పర్యావరణ వేత్తలు, పరిశ్రమల వారు చెప్పారు.

అంతేకాదు కొత్తగూడెం RO పరిధిలో ఉన్న పరిశ్రమలు, ఆస్పత్రులు ఎటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నియమ నిబంధనలను పాటించడంలేదని ఈ అధికారికి నెలవారి అవినీతి చందాలు ఇవ్వడం వలన తమ ఇష్టానుసారంగా విచ్చలవిడి పొల్యూషన్ చేసినా అడిగే వారు ఎవరు ఉండరని పలు పరిశ్రమల వారు మరియు ఆస్పత్రుల యాజమాన్యాలు భావిస్తున్నాయని స్థానిక ప్రజలు, పొల్యూషన్ బాధితులు వాపోతున్నారు. పర్యావరణ వేత్తలు, పొల్యూషన్ బాధితులు కాలుష్యకారక పరిశ్రమలపై ఫిర్యాదులు చేస్తే వాటిని కూడా ఇతను తమకు అనుకూలంగా మార్చుకుంటూ కాలుష్యం చేసే పరిశ్రమలపై చర్యలు తీసుకోకపోగా ఆ పరిశ్రమల యాజమాన్యాలతో కుమ్మక్కై అవినీతి సొమ్మును బాగానే దండుకుంటున్నారని.. అలాగే ఆస్పత్రులలో STPలు లేకున్న ఇతను అవినీతి సొమ్ము తీసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్న ఆస్పత్రులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఆస్పత్రులకు సర్టిఫికెట్లను ఇస్తున్నారని పలువురు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులే చెప్పడం విశేషం.

EE గారి ఇంతటి విచ్చలవిడి అవినీతికి ముఖ్యకారణం, PCBలోనే పలువురు ఉన్నతాధికారులు కూడా వీరు ఇచ్చే అవినీతి సొమ్ముకు ఆశపడి వీరిని గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆర్.ఒ. (RO)లోనే ఉంచడానికి కారణమని.. ఇందులో కొంతమంది అధికారులు బంధుప్రీతి కూడా చూపిస్తున్నారని PCB అధికారులే చెబుతున్నారు.

  • గతంలో కూడా RO అధికారులపై పలు ఫిర్యాదులు వచ్చాయని.. రాత్రికి రాత్రే రిపోర్ట్ లు రాసి చర్యలు తీసుకోవడం జరిగింది..
  • కానీ ఇప్పుడు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసిన కూడా చర్యలు తీసుకోవడంలో PCB ఉన్నతాధికారుల అలసత్వం ఎందుకు..?
  • ఫిర్యాదులు చేసిన పరిశ్రమల వారిపై బెదిరింపులకు పాల్పడి దారికి తెచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయా..?
  • పర్యావరణ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రెటరీలకు ఫిర్యాదు చేసిన సచివాలయంలోనే ఫైల్ ఆగడం వెనుక ఉన్న అధికారి ఎవరు..?
  • PCBలో ఎంత పెద్ద తప్పుచేసిన అండదండలు ఇస్తున్న సచివాలయ ఉన్నతాధికారి ఎవరు..?
  • ఫిర్యాదులు పట్టించుకోకపోవడం వెనుక ఉన్న గుట్టు ఏంటి..? పూర్తి వివరాలు త్వరలో మరో కథనంలో..

కొత్తగూడెం పిసిబి RO అధికారి విచ్చల వీడి అవినీతి భాగోతంపై మరో ప్రత్యేక కథనం త్వరలో మీ ముందుకు తీసుకువస్తుంది.. మీ నిఘా నేత్రం న్యూస్.. ✍️✍️