గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నాచారం లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS)ఆవరణంలో మొక్కలు నాటడం జరిగింది. ఈనెల 17వ గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని అందరూ కూడా మొక్కలు నాటాలనే సంకల్పంతో విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారు, స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి గారు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ గారు, ప్రతినిధి కిషోర్ గౌడ్, DPSస్కూల్ చైర్మన్ కొమురయ్య గారు తదితరులు పాల్గొన్నారు…