ఎక్సైజ్‌శాఖలో పది రోజుల్లో బదిలీలు: మంత్రి జూపల్లి జూపల్లి కృష్ణారావు

ఆబ్కారీ శాఖలో బదిలీలను 10 రోజుల్లోగా చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు ముందు ఎక్సైజ్‌ శాఖ ఆదాయం దాదాపు రూ.10వేల కోట్లు ఉండేదని, 2024-25 నాటికి ఈ ఆదాయం రూ.42వేల కోట్లకు చేరిందని చెప్పారు. ప్రతి 100 రోజులకు ఒకసారి ఎక్సైజ్‌శాఖలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల గురించి చర్చించి పరిష్కరిస్తానని పేర్కొన్నారు.