తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రైతు భరోసా నిధులు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • గత ప్రభుత్వం 10 సంవత్సరాలతో పోలిస్తే ఎక్కువ నిధులు, తక్కువ రోజుల్లో పంపిణీ
  • ఎన్నికల ముందు యాసంగి నిధులు వేయని గత ప్రభుత్వం
  • చిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మిగులు బడ్జెట్ తో ప్రభుత్వాన్ని అప్పగిస్తే గత ప్రభుత్వ పెద్దలు వారు చెప్పిన రైతు బంధు నిధులను ఏనాడు సక్రమంగా పంపిణీ చేయలేదు. మిగులు బడ్జెట్ ఉన్నప్పటికీ రైతుబంధు నిధుల మొత్తం తక్కువే అయినా పంపిణీకి ఒక్కో సీజన్లో 169 రోజులు సుమారు ఐదున్నర నెలలు పాటు సమయం తీసుకున్నారు. అదే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఎనిమిది లక్షల కోట్ల లోటు బడ్జెట్. రైతు భరోసా కింద గత ప్రభుత్వంతో పోలిస్తే ఎకరాకు 2,000 అదనంగా కలిపి 12,000 ఇవ్వాల్సిన సందర్భం. చిద్రమైన ఆర్థిక వ్యవస్థను స్వల్ప సమయంలోనే గాడిలో పెట్టిన డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క తక్కువ సమయంలోనే, పెద్ద మొత్తంలో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు.
కేవలం తొమ్మిది రోజుల్లో 8,744.13 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమచేసి దేశ చరిత్రలోనే ఓ రికార్డు సృష్టించారు.
గత ప్రభుత్వం ఎన్నికల ముందు వేయాల్సిన రైతు భరోసా నిధులను వేయకుండా వెళ్ళిపోగా రైతుల పట్ల బాధ్యత, ప్రేమ కలిగిన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారు వదిలేసిన యాసంగి కాలం 7,625 కోట్ల నిధులు రైతుల ఖాతాలో జమ చేశారు.

గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో పెట్టుబడి సాయంగా అందించిన నిధులు, సమయం తో ప్రజా ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా నిధుల మొత్తం, తీసుకున్న సమయాన్ని పోలిస్తే రైతుల పట్ల ఎవరికి బాధ్యత, ప్రేమ ఉన్నాయో స్పష్టం అవుతుంది.

2018 – 19 వానాకాలం సీజన్ కు 10- 05- 2018 లో రైతుల కు పెట్టుబడి సాయం వేయడం ప్రారంభించి 15-09-2018 నాటికి పూర్తి చేశారు. 128 రోజులపాటు సమయం తీసుకొని 5,237.56 కోట్ల నిధులు ఆ సీజన్లో జమ చేశారు.

2018-19 యాసంగి సీజన్ కు సంబంధించి 20-10-2018లో వేయడం ప్రారంభించి 30-03-2019 నాటికి పూర్తి చేశారు. 161 రోజుల పాటు సమయం తీసుకుని 5,248.80 కోట్ల నిధులు జమ చేశారు.

2019-20 వానకాలానికి సంబంధించి 04-06-2019 లో రైతుబంధు నిధులు వేయడం ప్రారంభించి 14-10-2019 నాటికి పూర్తి చేశారు. 132 రోజుల సమయం తీసుకుని 6,125.54 కోట్ల నిధులు జమ చేశారు.

2019 -20 యాసంగి కాలానికి సంబంధించిన రైతుబంధు నిధులను 28-1-2020 ప్రారంభించి 16-3-2020కి పూర్తి చేశారు. 48 రోజుల్లో 4406.48 కోట్ల నిధులను విడుదల చేశారు.

2020-21 వాన కాలానికి సంబంధించిన రైతుబంధు నిధులను 22-6-2020 న ప్రారంభించి 8- 12- 2020 న పూర్తి చేశారు. 169 రోజుల్లో 7288.70 కోట్ల నిధులను విడుదల చేశారు.

2020-21 యాసంగి కాలానికి సంబంధించి 28-12-2020న ప్రారంభించి 22-3- 2021కి పూర్తి చేశారు. 84 రోజుల్లో 7367.32 కోట్ల నిధులను విడుదల చేశారు

2021-22 వానాకాలంకి సంబంధించిన రైతుబంధు నిధులను 15-6-2021న ప్రారంభించి 25-6-2021న పూర్తి చేశారు. పది రోజుల్లో 7360.41 కోట్ల నిధులు విడుదల చేశారు

2021-22 యాసంగి పంటలకు సంబంధించి 24- 12- 2021న ప్రారంభించి 20-01-2022న పూర్తి చేశారు. 27 రోజుల్లో
7412.53 కోట్ల నిధులను విడుదల చేశారు.

2022- 23 వానకాలానికి సంబంధించిన రైతుబంధు నిధులను 28- 6- 2022న ప్రారంభించి 5-9-2022న పూర్తి చేశారు. 69 రోజుల్లో 7 7434.67 కోట్ల నిధులు విడుదల చేశారు.

2022-23 యాసంగి కాలానికి సంబంధించిన నిధులను 21- 12- 2022 న ప్రారంభించి 18- 5- 2023 న పూర్తి చేశారు. 148 రోజుల్లో 7308.35 కోట్ల నిధులు విడుదల చేశారు.

2023- 24 వానాకాలానికి సంబంధించిన రైతుబంధు నిధులను 26-6- 2023 న ప్రారంభించి 12- 10- 2023కు పూర్తి చేశారు. 108 రోజుల్లో 7637.91 కోట్ల నిధులు విడుదల చేశారు.
ప్రజా ప్రభుత్వం పాలనాపగ్గాలు చేపట్టగానే గత ప్రభుత్వ పెద్దలు ఎన్నికల ముందు వేయకుండా వెళ్లిపోయిన రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన నాలుగు రోజుల్లోనే రైతు భరోసా నిధులు జమ చేయడం ప్రజా ప్రభుత్వం నిబద్ధతను తెలియజేస్తుంది.

2023-24 యాసంగి కాలానికి సంబంధించిన 11- 12- 2023 న ప్రారంభించి 6- 5- 2024న పూర్తి చేశారు. 147 రోజుల్లో 7625.14 కోట్ల నిధులు విడుదల చేశారు.

2024-25 యాసంగి కాలానికి సంబంధించిన రైతు భరోసా నిధులను 26-1- 2025న ప్రారంభించి 02-04- 2025 పూర్తి చేశారు. 87 రోజుల్లో 5057.77 కోట్ల నిధులు జమ చేశారు.

2025- 26 వానా కాలానికి సంబంధించిన రైతు భరోసా నిధులను 16-6-2025న ప్రారంభించి 24-06-2025కి పూర్తి చేశారు. కేవలం తొమ్మిది రోజుల్లో 8744.13 కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు.