ఆర్‌అండ్‌బీ శాఖలో పదోన్నతులకు ఉత్తర్వులు జారీ

రోడ్లు, భవనాలశాఖలో 64మంది డిప్యూటీ ఇంజినీర్లకు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లుగా పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన అధికారులు శాఖ బలోపేతం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు.