మ‌హాన్యూస్ ఛాన‌ల్ పై దాడి అమానుష చ‌ర్య‌ : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

  • దాడి వెనుక ఎంత‌పెద్ద‌వారున్నా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిక‌
  • రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

మ‌హాన్యూస్ ఛాన‌ల్ కార్యాల‌యంపై బిఆర్ ఎస్ మూకల‌ దాడిని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది అమానుష చ‌ర్య అని పేర్కొన్నారు.

మీడియా సంస్ధ‌ల కార్యాల‌యాల‌పై ఈ ర‌కంగా భౌతిక దాడుల‌కు పాల్ప‌డ‌డం, విధ్వంసం సృష్టించ‌డం దారుణ‌మ‌ని ఇది ప‌త్రికా స్వేచ్ఛ‌పై దాడి అని శ‌నివారం విడుద‌ల చేసిన ఒక‌ ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేశారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిగారి ప‌క్షాన ప్ర‌భుత్వం త‌ర‌పున ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు.

సంస్ధ‌లు, వ్య‌వ‌స్ద‌ల‌పై పెయిడ్ ఆర్టిస్ట్ ల‌తో ఈ విధంగా దాడులు చేయించ‌డం ప్ర‌జాస్వామ్యంలో స‌రైన‌దికాద‌ని స్ప‌ష్టం చేశారు.. పార్టీ ప‌రంగా ఛాన‌ల్స్ నిర్వ‌హిస్తూ పెయిడ్ ఆర్టిస్ట్ ల‌తో ప్ర‌జాస్వామ్యానికి విరుద్దంగా ప‌త్రికా స్వేచ్ఛ‌ను దుర్వినియోగ‌ప‌రుస్తూ ప్ర‌భుత్వంపై ఇష్ట‌మొచ్చిన రీతిలో బుర‌ద జ‌ల్లుతున్నార‌ని అన్నారు.

ఏదైతే నిజాన్ని నిర్బ‌యంగా అధికార ప‌క్ష‌మ‌నో, ప్ర‌తిప‌క్ష‌మ‌నో తేడా లేకుండా ధైర్యంగా న్యూస్ ప్ర‌చారం చేస్తున్న ఎల‌క్ట్రానిక్ మీడియా గాని ధైర్యంగా న్యూస్ ప్ర‌చురిస్తున్న ప్రింట్ మీడియాకు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిగారి నేతృత్వంలో ప్ర‌జాప్ర‌భుత్వం అండగా ఉంటూ పూర్తి ర‌క్ష‌ణ కల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్ధ‌లో ఇలాంటి దాడుల‌కు చోటులేద‌ని అన్నారు. న్యూస్ ఛాన‌ల్ కార్యాల‌యంపై దాడికి పాల్ప‌డి హ‌త్యాయ‌త్నానికి ప్ర‌య‌త్నించిన వారి వెనుక ఎంత‌టి ఎంత పెద్ద‌వారున్నా వ‌దిలిపెట్టేదిలేద‌ని దోషుల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఇలాంటి దాడుల‌ను అరాచ‌కాల‌ను స‌హించేదిలేద‌న్నారు.