
తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదలైంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 19వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మార్చి 30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తారు. రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రీల్ 6వ తేదీ వరకు, రూ.1000 ఫైన్‌తో ఏప్రిల్ 13వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. రూ.5వేల ఫైన్‌తో ఏప్రీల్ 20 తేదీ వరకు, రూ.10వేల జరిమానాతో ఏప్రిల్ 27వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. మార్చి 31వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పిస్తారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 1 వ తేదీ వరకు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. మే 4, 5, 6వ తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్, మే 9, 11వ తేదీల్లో వ్యవసాయ, వెటర్నరీ కోర్సుల పరీక్షలు జరగనున్నాయి.