తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు..ఇక అదనపు కలెక్టర్లు

తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లుగా పనిచేస్తున్న 33 మందికి అదనపు కలెక్టర్‌ హోదా(పదోన్నతి) ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. న్యాయస్థానాల తీర్పునకు లోబడి ఈ నిర్ణయం ఉంటుంది. పదోన్నతితోపాటు వీరిని ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగిస్తూ రెవెన్యూశాఖ కార్యదర్శి డి.ఎ్‌స.లోకే్‌షకుమార్‌ శనివారం జీవో జారీ చేశారు. రెవెన్యూశాఖ చరిత్రలోనే తొలిసారిగా స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లకు అదనపు కలెక్టర్లుగా పదోన్నతి కల్పించారని డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి.లచ్చిరెడ్డి, కె.రామకృష్ణ తెలిపారు.

అందుకు హర్షం వ్యక్తం చేస్తూ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటిని కలిసి ధన్యవాదా లు తెలిపారు. ఈ నిర్ణయం రెవెన్యూశాఖలో మైలురాయిగా నిలవనుందని తెలంగాణ సివిల్‌ సర్వీ్‌స(ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌) డిప్యూటీ కలెక్టర్ల సంఘం పేర్కొంది. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిని ఆ సంఘం అధ్యక్షుడు కె.చంద్రమోహన్‌, చంద్రారెడ్డి కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికీ సంఘం ధన్యవాదాలు తెలిపింది.