పరిశ్రమలో భారీ పేలుడు 15 మంది దుర్మరణం

  • పాశమైలారం సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో పెనుప్రమాదం
  • 35 మందికి తీవ్ర గాయాలు పలువురి పరిస్థితి విషమం
  • మృతుల్లో పరిశ్రమ వైస్‌ప్రెసిడెంట్ గుర్తుపట్టని స్థితిలో మాడి మసైన మృతదేహాలు
  • 12మందికి 70నుంచి 80శాతం కాలిన గాయాలు క్షతగాత్రులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స
  • పేలుడు ధాటికి 100మీటర్ల దూరం ఎగిరిపడ్డ కార్మికులు
  • కుప్పకూలిన పరిశ్రమ భవనం, మరో భవనానికి బీటలు ఘటనాస్థలిలో భీతావహ పరిస్థితి
  • కార్మికుల కుటుంబాల రోదనలతో దద్దరిల్లిన పారిశ్రామికవాడ
  • ప్రమాదస్థలిని పరిశీలించిన మంత్రులు దామోదర రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి,
    అధికార యంత్రాంగం
  • వర్షంలోనూ కొనసాగిన సహాయక చర్యలు
  • ప్రధాని మోడీ, సిఎం రేవంత్‌రెడ్డి, మాజీ సిఎం కెసిఆర్ దిగ్బ్రాంతి
  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యానికి సిఎం ఆదేశం ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం, బీహార్

సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరులోని పాశమైలారం పారిశ్రామికవాడ సోమవారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉన్నట్టుండి పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ పేలు డు పెను విషాదాన్ని సృష్టించింది. పేలుడు ధా టికి దాదాపు రెండు కిలోమీటర్ల మేరకు భవనాలు కం పించాయి. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘట న స్థానికంగా ప్రజలను భయాందోళనకు గురిచేసిం ది. సిగాచీ రసాయన పరిశ్రమలోని రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. రియాక్టర్ భారీ శబ్దంతో పేలడంతో అందులో పనిచేస్తున్న కార్మికు లు 100 మీటర్లు అవతలికి ఎగిరిపడ్డారు. దీనితోపాటు పేలుడు దాటికి రియాక్టర్ ఉన్న భవనంతో పాటు అడ్మిన్ బిల్డింగ్ సైతం పూర్తిగా ధ్వంసమైంది. మరికొన్ని భవనాలకు బీటలువారాయి. ఈ ప్రమాదంలో 15 మంది కార్మికులు మృతి చెందారు. మ రో 35మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. మృ తుల్లో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సైతం ఉన్న ట్టు అధికారులు వెల్లడించారు.

ప్రమాదం సమాచారం అం దుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 ఫైర్ ఇంజన్ల స హాయంతో మంటలు మంటలు ఆర్పేసి సహాయక చ ర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులను పలు ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లకు తరలించా రు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, ఎస్‌పి పరితోష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడి ఉండవచ్చని. ప్రమాదం జరి గే సమయానికి 150 మంది పరిశ్రమలో పని చేస్తున్నారని సమాచారం. జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో పా టు ఎస్‌పి పంకజ్ పరితోష్ సహాయక చర్యల్లో పా ల్గొని సమీక్షించి సహాయక చర్యలను ముమ్మరం చే శారు.భారీగా మంటలు ఎగిసి పడుతుంటంతో అటు వైపుగా ఎవరూ రావద్దని ఆదేశాలు జారీ చేశారు.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం
రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటనలో 15 మంది మృతి చెందారు. అయితే, మృతుల సం ఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కార్మికుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల కింద ఇరుక్కుపోయి ఉండడంతో పాటు కార్మికులు మంటల్లో గుర్తుపట్టలేని స్థితిలో కాలిపోయారు. దీంతో డిఎన్‌ఏ రిపోర్టు ఆధారంగానే మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తామన్నారు.