మృతుల కుటుంబాల‌కు రూ. కోటి చొప్పున ప‌రిహారం.. సిగాచీ ప‌రిశ్ర‌మ ప్ర‌క‌ట‌న‌

  • 40 మంది మృతిచెందగా.. 33 మంది గాయపడ్డారు..
  • క్ష‌త‌గాత్రుల వైద్య ఖ‌ర్చులు భ‌రిస్తాం..

పాశ‌మైలారం ప్ర‌మాద ఘ‌ట‌న‌పై సిగాచీ ప‌రిశ్ర‌మ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ మేర‌కు ప్ర‌మాదంపై స్టాక్ మార్కెట్ల‌కు కంపెనీ సెక్ర‌ట‌రీ వివేక్ కుమార్ లేఖ రాశారు. ఈ ప్ర‌మాదంలో 40 మంది మ‌ర‌ణించిన‌ట్లు లేఖ‌లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాల‌కు రూ. కోటి చొప్పున ప‌రిహారం ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌మాదంలో 33 మంది గాయ‌ప‌డ్డార‌ని పేర్కొంది. గాయ‌ప‌డిన వారికి పూర్తి వైద్య‌సాయం అందిస్తామ‌ని తెలిపింది. గాయ‌ప‌డిన కార్మికుల‌ను అన్ని విధాలుగా అండ‌గా ఉంటాం. కార్మికుల‌కు అన్ని ర‌కాల బీమా క్లెయిమ్‌లు చెల్లిస్తాం. క్ష‌త‌గాత్రుల వైద్య ఖ‌ర్చులు భ‌రిస్తాం.. వారి కుటుంబ పోష‌ణ చూస్తామ‌ని సిగాచీ ప‌రిశ్ర‌మ త‌ర‌పున కంపెనీ సెక్ర‌ట‌రీ వివేక్ కుమార్ ప్ర‌క‌టించారు. ప్ర‌మాదానికి రియాక్ట‌ర్ పేలుడు కార‌ణం కాద‌ని తెలిపారు. ప్ర‌భుత్వ విచార‌ణ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామ‌ని పేర్కొన్నారు. ప‌రిశ్ర‌మ‌లో మూడు నెల‌ల పాటు(90 రోజులు) కార్య‌క‌లాపాలు నిలిపివేస్తున్నట్లు వివ‌నేక్ కుమార్ ప్ర‌క‌టించారు. ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని.. ప్రమాదంపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ దర్యాప్తు నివేదిక కోసం వేచి చూస్తున్నామని వివేక్‌కుమార్‌ అన్నారు.