జలమండలిలో 53 మంది ఉద్యోగులు పదవీ విరమణ

జలమండలిలో వివిధ హోదాల్లో పనిచేసిన 53 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. బోర్డు పరిధిలోని పలు డివిజన్లలో పనిచేసిన వీరంతా.. గత నెల 30న పదవీ విరమణ పొందారు. ఇందులో ముగ్గురు డిప్యూటీ జనరల్ మేనేజర్లు, ముగ్గురు సీనియర్ ఆఫీసర్లతో పాటు మరో 47 మంది వివిధ హోదాలో పనిచేశారు. వీరందరినీ ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. పదవీ విరమణ ద్వారా లభించే గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలు చెక్కు రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, సీజీఎం సురేష్, జీఎం సరస్వతి, ఉద్యోగులు పాల్గొన్నారు