నేడు చెంచులకు ఇండ్ల మంజూరు పత్రాలు.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

గవర్నర్‌ సూచనల మేరకు ఉట్నూర్‌, భద్రాచలం, మన్ననూర్‌, ఏటూరునాగారం తదితర నాలుగు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల పరిధిలోని 21నియోజకవర్గాల్లోని 13,266 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడతలో సోమవారం అచ్చంపేట నియోజకవర్గం మన్ననూర్‌లో ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు అందజేయనున్నట్టు వెల్లడించారు.

ఉట్నూ రు ఐటీడీఏ పరిధిలో 10,836, మంచిర్యాల -157, నిర్మల్‌ -153, ఆసిఫాబాద్‌- 3,371, బోధ్‌-163, ఖానాపూర్‌-2,257, సిర్పూర్‌-227, ఆదిలాబాద్‌-2,848, బెల్లంపల్లి-223, భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని అశ్వారావుపేట-274, మన్ననూర్‌ చెంచు స్పెషల్‌ ప్రాజెక్ట్‌లో -2156, అచ్చంపేట్‌-785, మహబూబ్‌నగర్‌-245, పరిగి-63, తాండూర్‌-174, కొల్లాపూర్‌-105, కల్వకుర్తి-120, వికారాబాద్‌ -63, దేవరకద్ర- 64, నాగార్జునసాగర్‌-17 ఇండ్లు ఇవ్వనున్నట్టు వివరించారు.