మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌కి రూ.5 వేలు జరిమానా

సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా అనుమతి లేకుండా హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులో కటౌట్‌ ఏర్పాటుచేసినందుకు రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీశాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ కు జీహెచ్‌ఎంసీ శనివారం రూ.5000 జరిమానా విధించింది. అక్రమంగా భారీ కటౌట్‌ ఏర్పాటుచేశారని, ఏమైనా సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని పేర్కొంటూ విశాల్‌ అనే వ్యక్తి జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదుచేశారు. దీనిపై తక్షణమే స్పందించిన జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు.. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌కి రూ.5000 జరిమానా విధించారు.