ఏసీబీకి చిక్కిన సివిల్‌సప్లయ్‌ డిప్యూటీ తహసీల్దార్‌

బియ్యం అక్రమ రవాణాలో పట్టుపడిన వాహనాలను విడిపించేందుకు రూ.70 వేల లంచం అడగడంతో సివిల్‌సప్లయ్‌ డిప్యూటీ తహసీల్దార్‌ను సోమవారం అరెస్ట్‌ చేసినట్టు ఏసీబీ డీఎస్పీ జగదీశ్‌చంద్ర తెలిపారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. మే నెలలో మిర్యాలగూడ నుంచి ఏపీకి పీడీఎస్‌ బియ్యాన్ని తరలిస్తున్న రెండు లారీలతో పాటు ఒక కారును సివిల్‌సప్లయ్‌ శాఖ సీజ్‌ చేసింది.

ఈ వాహనాలను విడిపించేందుకు పంచనామా రిపోర్టు ఇవ్వమని బాధితుడు డీటీ జావేద్‌ను కోరగా ఆయన రూ.లక్ష డిమాండ్‌ చేశారు. అంత ఇవ్వలేనని చెప్పడంతో రూ.70 వేలు ఇవ్వాలని అడగడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుమేరకు ఏసీబీ అధికారులు తనిఖీచేసి డీటీని అరెస్ట్‌ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టుకు రిమాండ్‌ చేశారు.