న్యూఢిల్లీ: కొత్తగా ముగ్గురు గవర్నర్లను నియమిస్తు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గోవా రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులయ్యారు. హర్యానా గవర్నర్‌గా ఆషింకుమార్ ఘోష్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తాలను నియమించారు. ఇక హర్యానా గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయ పదవీ కాలం ముగిసింది.
టిడిపి ఆవిర్భావం నుంచి అశోక్ గజపతిరాజు పార్టీకి సేవలు అందిస్తున్నారు. ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపిగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ వ్యవహారాలతో పాటుగా ఆర్దిక, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖలను పర్యవేక్షించారు. 2014లో విజయనగరం ఎంపిగా గెలిచిన ఆయన అప్పటి మోదీ ప్రభుత్వం లో విమానయాన శాఖ మంత్రిగా కేబినెట్ హోదాలో నిర్వహించారు. గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు నియామకంపై టిడిపి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.