ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ ఏఎస్పీగా వెంకటేశ్వరబాబు బాధ్యతలు

ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖలో అడిషనల్‌ ఎస్పీగా వెంకటేశ్వరబాబు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇదేపోస్టులో పనిచేసిన భాసర్‌ ఇటీవల పదవీ విమరణ పొందారు. ఖాళీగా ఉన్న ఆ పోస్టులోకి మెదక్‌ ఇంటెలిజెన్స్‌లో అడిషనల్‌ ఎస్పీగా పనిచేస్తున్న వెంకటేశ్వరబాబు ఎక్సైజ్‌శాఖలోకి వచ్చారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ఎక్సైజ్‌ కమిషనర్‌ సీ హరికిరణ్‌ను, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షాన్‌వాజ్‌ ఖాసింను, అడిషనల్‌ కమిషనర్‌ సయ్యద్‌ యాసిన్‌ ఖురేషిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం డీఎస్పీలు తుల శ్రీనివాసరావు, తిరుపతి యాదవ్‌, సీఐ వెంకటేశ్వర్లు, నాగరాజులతో సమీక్ష నిర్వహించారు.