వాణిజ్య పన్నుల అదనపు కమిషనర్‌ లావణ్యపై బదిలీ వేటు

పన్ను వసూళ్లపై ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారంటూ అసిస్టెంట్‌ కమిషనర్లు ఫిర్యాదు చేసిన అనంతరం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్‌ జి.లావణ్యపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆబిడ్స్‌ డివిజన్‌ను పర్యవేక్షిస్తున్న ఆమెను వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ కార్యాలయానికి బదిలీ చేసింది. ఈమేరకు వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. లావణ్యతో పాటు సికింద్రాబాద్‌ డివిజన్‌ అదనపు కమిషనర్‌ వాసవీ జగన్నాథం, మాదాపూర్‌ అదనపు కమిషనర్‌ కె.గీతలను కూడా కమిషనరేట్‌కు బదిలీ చేశారు.