గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన టీసీఎస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజన్న

టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వి.రాజన్న మొక్కలు నాటారు. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు గచ్చిబౌలిలోని టీసీఎస్‌ కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మరో ఆరుగురికి మొక్కలు నాటాలని ఛాలెంజ్‌ విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజు పురస్కరించుకొని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన Each one plant one పిలుపు మేరకు మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు.