ఈరోజు తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మకమైన రెండవ స్నాకోత్సవం విజయవంతం మైందని వైస్ -ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు తెలిపారు. విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో ఏర్పాటుచేసిన స్నాతకోత్సవ ప్రాంగణంలో స్నిఫర్ డాగ్ స్క్వాడ్ బృందం, బాంబు డిస్పోజల్ టీం, మరియు ఇంటలిజెన్స్ అధికారులు పర్యవేక్షణలో భారీ బందోబస్తు మధ్య అంగరంగ వైభవంగా స్నా తకోత్సవం పూర్తయింది. ఈ సందర్భంగా గవర్నర్ మరియు విశ్వవిద్యాలయ చాన్స్లర్ శ్రీ విష్ణుదేవ్ వర్మ గారికి ఏడవ పటాలపు గాడ్ ఆఫ్ హోనర్ టీం మరియు బ్యాండ్ టీం ఆర్ఎస్ఐ కొమ్ము శ్రీకాంత్ ఆధ్వర్యంలో గౌరవ వందనం సమర్పించినారు.
అనంతరం గవర్నర్ మరియు విశ్వవిద్యాలయ కులపతి మాన్య శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు నాతకోత్సవాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగిస్తూ రాష్ట్రం పేరుతో ఏర్పాటుచేసిన తెలంగాణ విశ్వవిద్యాలయానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని గర్వంగా చెప్తున్నానని తెలిపారు. చైతన్యవంతమైన ఈ మట్టిలోని ప్రజల ఆకాంక్షలు, సామర్ధ్యాలు విశ్వవిద్యాలయ అభివృద్ధిలో స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విశ్వవిద్యాలయం సాధించిన విజయాలు, విశేషమైన ప్రగతిపూర్వకమైన సంఘటనలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.
2006లో ఆరు కోర్సులతో ప్రారంభమై నేడు ఏడు విభాగాలలో 24 ఉపవిభాగాలుగా 31 కోర్సులతో బిక్నూరు సారంగపూర్ క్యాంపస్లతో సహా ఇక్కడ ప్రధాన క్యాంపస్ లో విద్యా వికాసం చెందడం ఆనందంగా ఉందని తెలిపారు.
గడిచిన 19 సంవత్సరాల కాలంలో ఇక్కడి అధికారులు అధ్యాపకులు, విద్యార్థులు పరిశోధకుల ఉమ్మడి కృషి అంకితభావం ప్రతిబింబిస్తుందన్నారు. స్నాతకోత్సవ ఏర్పాట్లు కేవలం విద్యాపరమైన లక్ష్యసాధన మాత్రమే కాదని విశ్వవిద్యాలాయంలో నాణ్యమైన, సాంకేతిక విద్య, ఉపాధి కల్పించే భవిష్యత్ ప్రయాణానికి మార్గాన్ని నిర్దేశిస్తుందన్నారు. 2023 – 24 రాష్ట్ర ఆర్థిక సర్వే ప్రకారం 51 శాతం పట్టభద్రులు దేశానికి నైపుణ్యాల కొరత తీరుస్తూ ఉద్యోగాలు పొందుతున్నారన్నారు. ఈ విశ్వవిద్యాలయం అనేకమైన, ఆశాజనకమైనటువంటి పారిశ్రామిక విద్యాపరమైన సంబంధాలతో ముందుకు పోవడం స్వాగతించాల్సిందన్నారు .
ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పినట్లు విద్య యొక్క అంతిమ లక్ష్యం సృజనాత్మకమైన మానవుని తయారు చేయడంతో పాటు , ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ చారిత్రాత్మకమైన అభివృద్ధిని స్పృశించడం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొఠారి కమిషన్ లో చెప్పినట్లుగా దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే తీర్చిదిద్ద పడుతుందనేది విశ్వవిద్యాలయ విజయాలు రుజువు చేస్తున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన భారత రసాయన శాస్త్ర సాంకేతిక సంస్థ మాజీ డైరెక్టర్ ఆచార్య శ్రీవారి చంద్రశేఖర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం నుండి బయటకు వెళ్లిన ప్రతి విద్యార్థికి ఆందోళనతో పాటు అవకాశాలు కనిపిస్తాయి అన్నారు. ఆందోళన చెందకుండా అవకాశాల వైపు పరిగెత్తాలి అన్నారు. వర్తమాన కాలంలో అనేక అవకాశాలతో విద్యార్థులు తమ నైపుణ్యాలను, కౌశలాలను, అభిరుచులను ఉపయోగించుకొని అనేక రకాలుగా స్థిరపడే అవకాశం ఉందన్నారు. వారి వారి శక్తి సామర్థ్యాల మేరకు, అభిరుచి మేరకు కొందరు పరిశోధకులుగా మరికొందరు పారిశ్రామికవేత్తలుగా వ్యవస్థాపకులుగా ప్రజాసేవకులుగా విద్యావేత్తలుగా ఉన్నత ఉన్నతంగా స్థిరపడుతున్నరన్నారు.
విద్యార్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది జీవితమనేది పందెం లాంటిది కాదని ఇది ఒక ప్రయాణం మాత్రమేనని గుర్తు చేసినారు. ఈ ప్రయాణానికి సమయస్ఫూర్తి లోతైన అధ్యయనం తో పాటు తీసుకునే నిర్ణయాలు మీద భవిష్యత్ నిర్ణయం జరుగుతుందని తెలిపారు. వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఈ యాదగిరిరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న కోర్సుల వివరాలతో పాటు అవస్థాపన సౌకర్యాలను సమగ్రంగా తెలియజేసినాడు. విశ్వవిద్యాలయంలో సమీప భవిష్యత్తులో ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పరిపాలనా భవనము 500 మంది విద్యార్థినిలకు అన్ని రకాల వసతులు ఉండే విధమైన బాలికల హాస్టల్ ను, వెయ్యి మంది కెపాసిటీతో ఉండే ఆడిటోరియం అన్ని హంగులతో క్రీడా మైదానం అభివృద్ధి లాంటి భవిష్యత్ ప్రణాళికలను తెలియజేశారు.
విశ్వవిద్యాలయం విస్తరణలో భాగంగా విశ్వవిద్యాలయ పరిధిని నిజామాబాదు కామారెడ్డి నుండి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలకు విస్తరించే కృషి చేస్తానన్నారు. ఈ విశ్వవిద్యాలయ మౌలికమైన అభివృద్ధి, ప్రజా ప్రతినిధులతో పాటు, బోధన బోధనేతర సిబ్బంది యొక్క కృషి మీదనే ఆధారపడుతుందని తెలియజేశారు. ఈ స్నాతకోత్సవంలో 15 విభాగాలలో 2014 నుండి 2023 వరకు 132 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందించినారు. 156 మంది పరిశోధకులకు డాక్టరేట్ పట్టాలనిచ్చి నారు. ఈ స్నాతకోత్సవంలో డీన్స్ ప్రొఫెసర్ గంటా చంద్రశేఖర్, ప్రొఫెసర్ అపర్ణ, ప్రొఫెసర్ రాంబాబు, ప్రొఫెసర్ లావణ్య, ప్రొఫెసర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఈ స్నాతకోత్సవంలో ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, ప్రొఫెసర్ హారతి, ప్రొఫెసర్ నాగరాజు, ప్రొఫెసర్ కనకయ్య, ప్రొఫెసర్ విద్యావర్ధిని, ప్రో అరుణ ప్రొఫెసర్ నాగరాజు పాత, పి ఆర్వో డైరెక్టర్ డా. ఏ పున్నయ్య లతో పాటు బోధన బోధ నేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులు ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
