మురళీధర్‌రావును కస్టడీకి ఇవ్వాలని కోర్టులో ఏసీబీ పిటిషన్‌

 ఆక్రమాస్తుల ఆరోపణల కేసులో నీటిపారుదలశాఖ మాజీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్సీ) మురళీధర్‌రావును ఏడు రోజులపాటు కస్టడీకి అప్పగించాలని కోరు తూ గురువారం నాంపల్లి కోర్టులో ఏసీబీ అధికారులు పిటిషన్‌ దాఖలు చేశారు. 11 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించి సేకరించిన పత్రాల వివరాలను తెలుసుకోవాల్సి ఉందని, పేర్కొన్నారు.

మురళీధర్‌రావు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై గురువారం వాదనలు జరిగాయి. కక్షసాధింపుతోనే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారని మురళీధర్‌రావు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. నిందితుడికి బెయిల్‌ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని ఏసీబీ తరపు న్యాయవాది చెప్పారు. ఇరువైపులా వాదనలు న్యాయమూర్తి తీర్పును శుక్రవారానికి రిజర్వు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.