ఇటీవల గురుకులాల్లో జరుగుతున్న వరుస సంఘటనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ లు ,టీచర్ లు పిల్లలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు పై అధికారుల దృష్టికీ తీసుకురావాలి. పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించడం లో రాజీపడద్దు..ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కటిన చర్యలు తప్పవు. పిల్లలకు పోషకాలతో పౌష్టికాహారం అందించడంలో ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచింది..మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి. పాఠశాలలో శుభ్రత పాటించాలి.. విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు.
గురుకులాల్లో ఏ సంఘటన జరిగిన అధికారులదే బాధ్యత..
ప్రతి స్కూల్లో తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలి. ఇందులో విద్యార్థులు టీచర్లు ప్రిన్సిపల్ సభ్యులుగా ఉండాలి. ఈ కమిటీ సభ్యులు ఆహారాన్ని రుచి చూసిన తర్వాతే పిల్లలకు వడ్డించాలి. విద్యార్థులకు సంబంధించి అన్ని రకాల పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలి. నైటీడ్యూటీ చేసే ఉపాధ్యాయులు స్కూల్లో విద్యార్థులందరికీ అందుబాటులో ఉండాలి. స్కూల్ పరిసరాలు అన్నీ కూడా పర్యవేక్షించాలి. విద్యార్థులకు ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు వారికి ఇచ్చే మందులను ఒకటికి రెండుసార్లు ఎం ఎన్ ఎం పరిశీలించాలి. అవసరమైన మందులు మాత్రమే విద్యార్థులకు ఇవ్వాలి. విద్యార్థులకు అందించే భోజనం తయారుచేయడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఆహార పదార్థాలను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ విద్యార్థులకు అందించాలి.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని దోమలు రాకుండా అన్ని హాస్టల్స్ కి నెట్ ఏర్పాటు చేయాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అకాడమి క్యాలెండర్ ను కచ్చితంగా పాటిస్తూ పదోతరగతి, ఇంటర్ లో మెరుగైన ఫలితాలు సాధించడానికి ఇప్పటినుంచే ఉపాధ్యాయులు ప్రణాళికలు సిద్ధం చేయాలి. చాలా విద్యాసంస్థలు ప్రైవేట్ బిల్డింగ్ లోనే ఉన్నాయి కాబట్టి వాటి నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ఈ జూమ్ మీటింగ్ లో బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీధర్, ఎంజేపి గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు , జాయింట్ సెక్రెటరీ తిరుపతి, అన్నీ జిల్లాలో ఆర్ సి వో లు, గురుకులాల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.