అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 26 వరకు బొగత జలపాతం సందర్శన నిలిపివేయడం జరుగుతుందని ములుగు DFO కిషన్ జాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ముత్యందార, కొంగర, మామిడి లొద్ది, కృష్ణపురం జలపాతాలను ప్రయాణీకుల భద్రతాకారణాల దృష్ట్యా శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.. ఎట్టి పరిస్థితుల్లో సందర్శకులు ఇటు వైపు వెళ్లవద్దని సూచించారు. అటవీ అధికారులు హెచ్చరికలు బేఖాతరు చేసినవారిపై పోలీసు కేసును నమోదు చేస్తామని తెలిపారు.
