తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారులకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్‌లు ఇస్తూ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఉమాహారతిని నారాయణఖేడ్, అర సంకేత్‌కుమార్‌ను భైంసా, అభిజ్ఞాన్ మాలవీయను ఆర్మూర్, అజయ్ యాదవ్‌ను కల్లూరు, మృణాల్ శ్రేష్టను భద్రాచలం, ఐఈఎస్‌ఎస్‌డీ మనోజ్‌ను బెల్లంపల్లి సబ్ కలెక్టర్లుగా నియమించారు.
