డా. సురేంద్రబాబు ఆధ్వర్యంలో నిర్మాణం చేసిన అమ్మపాలు అమృతాలు వీడియో సాంగ్ nu ఆవిష్కరించిన భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ. తల్లిపాల ప్రాధాన్యతను చాటి చెప్పే “అమ్మపాలు అమృతాలు” వీడియో సాంగ్ ను రవీంద్రభారతిలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ప్రముఖ గాయకులు రామాచారి గారు ఈ పాటను విడుదల చేశారు.
సిరిసిల్లకు చెందిన అమృత మరియు హిమాన్షి పిల్లల హాస్పిటల్స్ అధినేత, నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో “అమ్మపాల వారోత్సవాలు” సందర్భంగా ఈ పాట రూపొందించారు. ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారు రచించిన ఈ పాటను వర్థమాన గాయకుడు గుండ్లూరు రవీంద్రబాబు స్వరపరిచారు. సంగీతాన్ని మహేందర్ శ్రీరాముల అందించారు. వేగవంతంగా సాగుతున్న ఆధునిక జీవనశైలిలో తల్లులు పాలివ్వడం మరిచిపోతుండటంతో, ఆ కారణంగా పిల్లలకు కలిగే నష్టాలను ఈ పాట ద్వారా చెప్పాలన్నదే తమ లక్ష్యమని డా. సురేంద్రబాబు తెలిపారు.
ఆధునిక కాలంలో అమ్మల లాలన పిల్లలకు కరువైందని ఈ పాటతో తల్లుల్లో మంచిని అవగాహన కలుగుతుందని అమ్మ పాల ప్రత్యేకత ఈ పాటలో అంతర్లీనంగా ఉందని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పైడికొండల కిషోర్ కుమార్, వెంకట్ బాలగోని, యోగా ఉపాధ్యాయుడు రామకృష్ణ, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.