ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారుల మంజూరీపై గడ్కరీతో సుదీర్ఘంగా సమావేశమై చర్చించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మంత్రితో పాటు హాజరైన తెలంగాణ ఎంపీలు. హైదరాబాద్-విజయవాడ: మల్కాపూర్ నుంచి విజయవాడ (అమరావతి) వరకు రహదారిని 4 వరుసల నుంచి 6 వరుసలు గా విస్తరించడంతో పాటు సర్వీస్ రోడ్లను నిర్మించాలని గడ్కరీని కోరిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. డెత్ రోడ్డుగా పిలిచే హైదరాబాద్-విజయవాడ రహదారిపై (NH-65) జూలై 27 న జరిగిన ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీల మృతి చెందిన విషయాన్ని గడ్కరీ దృష్టికి తీసుకువచ్చిన మంత్రి.. చలించిపోయిన గడ్కరీ. 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ప్రతీరోజు ప్రమాదాల వార్తలను వినడం, కొన్నిసార్లు ప్రత్యక్షంగా చూడటం బాధ కలిగిస్తుందని తన ఆవేదనను గడ్కరీతో పంచుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన గడ్కరీ.. ఆగష్టు 15 వ తేదీన నిర్వహించే ఫైనాన్స్ మీటింగ్ లో ఎన్.హెచ్-65 విస్తరణను ఆమోదిస్తామని.. త్వరితగతిన అంచనాలు రూపొందించి పంపాలని, వెంటనే టెండర్లు పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డికి హామీ ఇచ్చిన గడ్కరీ.

సంగారెడ్డి టూ చౌటుప్పల్: రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ పూర్తి చేసిన విషయాన్ని గడ్కరీ దృష్టికి తీసుకువచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని గడ్కరీని కోరిన మంత్రి. 4 వరుసలుగా నిర్మించాలనుకున్న రీజినల్ రింగ్ రోడ్డు ను భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 6 వరుసలుగా నిర్మించేందుకు ఎస్టిమేషన్లు మాడిఫై చేస్తున్నామని, టెండర్లను సైతం అందుకు అనుగుణంగా ఫైనలైజ్ చేస్తమని గడ్కరీకి వివరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రీవైజ్ ఇష్టిమేషన్ తో 3 నెలల్లో ఉత్తర భాగం పనులు మొదలు పెట్టాలని, అంతేకాకుండా ఉత్తర భాగంతో పాటే దక్షిణ భాగం కూడా యుద్ధప్రతిపాదికన ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని గడ్కరీని కోరిన మంత్రి. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం ఇండస్ట్రీయల్ కారిడార్ గా రూపుదిద్దుకొనున్న నేపథ్యంలో వేగంగా పనులు చేపడితే అనుకున్న వ్యయంలోనే భూసేకరణ పూర్తవుతుందని.. ఆలస్యం జరిగితే భూసేకరణకు ధరలు పెరిగి ప్రాజెక్టుకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని సవివరంగా గడ్కరీకి వివరించిన మంత్రి కోమటిరెడ్డి. మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తిపై పాజిటివ్ గా స్పందించిన గడ్కరీ.. అలైన్ మెంట్ ప్రపోజల్స్ పంపితే, అనుకున్నదానికన్న ముందే పనులు ప్రారంభించేలా చర్యలు చేపడతామని గడ్కరీ హామీ.

ఎల్ బీ నగర్ – మల్కాపూర్ : చింతల్ కుంట చెక్ పోస్ట్ నుంచి హయత్ నగర్, ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వరకు దాదాపు 5 ½ కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎలివేటెడ్ కారిడార్ గా నిర్మించడంతో పాటు నాగ్ పూర్ లో మాదిరిగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ గా నిర్మాణం చేపట్టాలని గడ్కరీని రిక్వెస్ట్ చేసిన మంత్రి. కోమటిరెడ్డి చేసిన విజ్ఞప్తికి ఓకే తెలిపిన గడ్కరీ. అందుకు సంబంధించిన ప్రపోజల్స్ పంపిస్తే వెంటనే మంజూరీలు ఇస్తానని తెలిపిన గడ్కరీ. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం వియూపీలు నిర్మించడం వలన తీవ్రంగా ఇబ్బందులు పడుతామని ప్రభుత్వానికి స్థానిక ప్రజలు కోరుతున్నందున.. దాన్ని ఎలివేటెడ్ గా మంజూరీ చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి రిక్వెస్ట్ కు సానుకూలంగా స్పందించిన గడ్కరీ.

హైదరాబాద్–శ్రీశైలం రోడ్డ్ జాతీయ రహదారి(ఎన్ హెచ్ -765) : హైదరాబాద్ – శ్రీశైలం రహదారి: లో టైగర్ రిజర్వ్ నుంచి వెళ్తున్న ప్రాంతాన్ని ఎలివేటెడ్ కారిడార్ గా గుర్తించాలన్న మంత్రి కోమటిరెడ్డి విజ్ఞాపనకు.. అలైన్ మెంట్ అప్రూవల్ ఇస్తూ మంజూరీ చేస్తానని హామి ఇచ్చిన మంత్రి గడ్కరీ. • ఈ రహదారి ప్రాంతం ప్రస్తుతం 62 కిలోమీటర్లు ఉందని, ఎలివేటెడ్ కారిడార్ గా మార్చితే నాలుగు కిలోమీటర్లు తగ్గి 58 కిలోమీటర్ల అవుతుందని తెలిపిన మంత్రి.

హైదరాబాద్ – మన్నెగూడ : ఈ రహదారికి సంబంధించి.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఉన్న అంశాన్ని త్వరగా పూర్తి చేసి కాంట్రాక్టర్ ను ఒప్పించి త్వరితగతిన పనులు పూర్తిచేయడానికి సహకరించాలని అడిగిన మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి. వేగంగా అన్ని అంశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి గడ్కరీ. ఇవే కాకుండా, సేతు బంధన్ మరియు సిఆర్ఐఎఫ్ (సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) నుంచి ప్రపోజల్స్ ఫర్ సాంక్షన్ కు మంత్రి కోమటిరెడ్డి రిక్వెస్ట్ చేయగా వచ్చే వారం మీ సెక్రటరీతో ప్రపోజల్స్ పంపించి మంజూరీ చేసుకొవాల్సింది చెప్పిన గడ్కరీ.

• కేంద్రమంత్రి గడ్కరీతో సమావేశంపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణలో జాతీయ రహదారులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నాని.. అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో పనులు ముందుకు సాగుతున్నాయని తెలిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఉప్పల్ ఫ్లైఓర్ పనులపై నిరంతరం పర్యవేక్షిస్తున్నానని, వీటితో రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన రహదారుల అందించేందుకు హ్యామ్ విధానంలో ఇప్పటికే రోడ్లను ఎంపిక చేశామని తెలిపిన మంత్రి. అడిగిన ప్రతీ రహదారి విజ్ఞప్తిని ఎంతో సహృదయంగా స్వీకరించి అన్ని రోడ్లకు మంజూరీలు ఇస్తానని తెలిపిన కేంద్ర మంత్రి గడ్కరీ కి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.