అన్న చెల్లెళ్ల ఆత్మీయతకు ప్రతి రూపం రాఖీ పండుగ అన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని శనివారం నాడు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క. రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రుల నివాస సముదాయంలో రాఖీ కట్టారు. ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుని రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సీతక్క తనకు సొంత సోదరిలాగా అని మంత్రి తన ఆప్యాయతను వ్యక్తం చేశారు. అన్న చెల్లెళ్ల, అక్క తమ్ముళ్ళ అనుబంధాన్ని చాటే రాఖీ పండుగ ప్రతి ఒక్కరు ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
