ప్రజా ప్రభుత్వంలో దేవాదులకు అత్యంత ప్రాధాన్యత: ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి జే చొక్కారావు దేవాదుల ప్రాజెక్ట్ అత్యంత ప్రాధాన్యత కలిగినది. దేవాదుల ప్రాజెక్టు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి, పెండింగ్ బిల్లులు కలిపి మొత్తం వంద కోట్ల రూపాయలు ఉన్నాయని చెబుతున్నారు. వాటిని విడతాలవారీగా విడుదల చేస్తాము. ఇందుకు సంభందించిన వివరాలను అధికారులు వెంటనే పంపాలి. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని 17 నియోజక వర్గాలకు సాగునీరు అందుతోంది.

రైతులకు ఇబ్బందులు రాకుండా ఏడాదిలో రెండు సీజన్లకు సాగు నీటిని ఈ ప్రాజెక్టు ద్వారా అందించాలని.. అందుకు తగినవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా నిర్మాణం చేపట్టినా.. మరింత పెరిగి ప్రస్తుతం ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. సాగు నీటి ఆయకట్టు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ప్రత్యేక దృష్టి సారించి.. అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని.. త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నాను.

అలాగే పెరిగిన ఆయకట్టుకు కూడా నీరు అందించేలా ప్రణాళికలు చేయాలని కోరుతున్నాను. గతంలో ఇక్కడ 38 టీఎంసీల స్సామర్థ్యం ఉండగా.. ఇప్పుడు 78 నుంచి 80 టీఎంసీల అవసరం అవుతుందని చెబుతున్నారు.. దాని గురించి కూడా ఇరిగేషన్ మంత్రి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటుగా.. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వాకిటి శ్రీహరి, సీతక్క,
ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, మురళి నాయక్, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, ఎంపీ బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.