సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని సినీ దర్శకుడు హరీష్ శంకర్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజున తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటాలన్న టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల పిలుపు మేరకు బంజారాహిల్స్‌లోని హరీష్ శంకర్ ఆఫీస్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ… మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. హరితహారంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. బాల్యమిత్రుడు, ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌తో ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమన్నారు.
ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ… సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రమంతా ఈ రోజు హరితహారంలో పాల్గొంటుందన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తాను విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన నా మిత్రుడు, డైరెక్టర్ హరీష్ శంకర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మన్నె కవితతో పాటు సీనియర్ జర్నలిస్టులు పి.వి.శ్రీనివాస్, వై.జె రాంబాబు తదితరులు పాల్గొన్నారు.