విద్యుత్తు డిమాండ్ ఎంత ఉన్నా… నాణ్యతతో సరఫరా చేస్తున్నాము. గ్రీన్ పవర్ ఉత్పత్తికి భారీ ప్రణాళికలు. పన్ను భారం మోపకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. భవిష్యత్ తరాల కు మేలు చేసే విధంగా విద్యుత్ ఉత్పాదనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా గ్రీన్ ఎనర్జీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం పడివడిగా అడుగులు ముందుకు వేస్తుంది. 2047 నాటికి పెరిగే డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలపైన సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపడుతున్నాం. అందుకు సంభందించిన సమాచారన్ని పంపాలని ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసాం.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, రెసిడెన్షియల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో వందకు వందశాతము సౌర విద్యుత్ ఉత్పత్తి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అందుకు సంబంధించిన సమాచారాన్ని వారం రోజుల్లో పంపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసాం. దేవాదాయ, ఇరిగేషన్ , మరే ఇతరమైన ప్రభుత్వ భూములు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఖాళీగా ఉంటే వాటి సమాచారాన్ని పంపించాలని అధికారులను ఆదేశించాం. ఆ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడడంతోపాటు అక్కడ సోలార్ విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నాం.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భారీ మధ్య తరహా ప్రాజెక్టులపై కూడా ఫ్లోటింగ్ సోలార్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పాదన చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం. ఇందుకు సంబంధించిన సమాచారం కోసం ఇప్పటికే నీటిపారుదల శాఖకు విద్యుత్ శాఖ లేఖ రాయడం జరిగింది. హైడల్, పుంప్డ్ స్టోరేజ్, పవన విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి ప్రణాళిక రూపొందిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకి విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది. విద్యుత్ ఉత్పాదన చేయడం ఒక భాగమైతే.. విద్యుత్ ను సరఫరా చేయడం మరో భాగం. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను అనుగుణంగా సరఫరా లోడ్ ని నియంత్రించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా సబ్ స్టేషన్ లను పెంచుకోవడం, అప్ గ్రేడ్ చేయడం, ట్రాన్స్ఫార్మర్లను పెంచుకోవడం చేస్తున్నాం.
అందువల్లనే డిమాండ్ ఏ స్థాయిలో ఉన్న ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను అందించగలిగాం.రెప్పపాటు కాలం పాటు విద్యుత్ పోకుండా చూస్తున్న విద్యుత్ శాఖ అధికారులు అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఈ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు, కార్మికులకు సింగరేణిలో మాదిరిగానే కోటి రూపాయల ప్రమాద భీమా కల్పించేందుకు చర్యలు చేపడుతున్నాం. చేవెళ్ల నియోజకవర్గంలో ఒకేసారి రూ. 20 కోట్లకు పైబడిన నిధులతో నిర్మించతలపెట్టిన మూడు 33/11 కేవీ సబ్ స్టేషన్లకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శంఖుస్థాపన చేశారు. ఈ నియోజకవర్గానికి 5 షబ్ స్టేషన్లు మంజూరుచేస్తే.. ఇప్పటికే రెండు షబ్ స్టేషన్ల పనులు కొనసాగుతున్నాయి. స్థానిక అవసరాలు, పరిస్థితుల దృష్ట్యా 132 కేవీ సబ్ స్టేషన్ కు ఏర్పాటుకు అవసరమైన డిమాండ్ ను స్టడీ చేసి నివేదికను విద్యుత్ అధికారులు వెంటనే పంపాలి. అనుమతులు మంజూరు అయిన తరువాత ఇక్కడే 132 కేవీ షబ్ స్టేషన్ కు భూమి పూజ కూడా చేసుకుందాం.
దేశంలో ఎక్కడా లేనివిధంగా రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి సన్నబియ్యాన్ని అందిస్తున్నాం. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున కార్డులో ఎంతమంది ఉంటే ఎంతమందికి సన్నబియ్యాన్ని అందిస్తున్నాం. మార్కెట్లో సన్న బియ్యం కిలో రూ.50కి పేజిక్ ధర్క్ ఉంటే.. మన ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. రాష్ట్రంలో 95 లక్షల కుటుంబాలకి ప్రజా ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తుంది. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ప్రజల ఆలోచనని వారి అవసరాలని అజెండాగా పెట్టుకొని ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది. కొత్తగా ఎక్కడ పన్నులు వేయకుండా మనకున్న ఆదాయంతోనే ప్రజా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది.
